Wednesday, July 7, 2010


ప్రజలందరికి ముఖ్యంగా యువతకు ఆదర్శ ప్రాయంగా నేత్రదాన ప్రతిజ్ఞ చేసిన 
గవర్నర్ దంపతులకు 
హర్షాతిరేక అభినందనలు.
      

ఈ ప్రతిన హృదయాంతరాలలో కలిగించెను ఆర్తి.
వారి సామాజిక స్పృహ కావాలి మనందరికీ స్పూర్తి.

                                                                                                           నడుద్దాం మనమూ వారి బాటలో.
                                                                                                           పంచుదాం వెలుగును చీకటి జీవితాల్లో.







అభినందనలు మరియు కృతజ్ఞతలు  

       తిరుమల తిరుపతి దేవస్థానం గౌరవ  పాలక మండలి మరియు ముఖ్య కార్య నిర్వహణాధికారి శ్రీ కృష్ణా రావు గారు ఈ మధ్య కాలంలో తీసుకున్న రెండు నిర్ణయాలు పర్యావరణానికి మరియు మన సత్సాంప్రదాయానికి ఎంతో మేలు చేసే విధంగా ఉన్నాయి.   

       ౧.    ప్లాస్టిక్ రహిత సంచులలో శ్రీవారి ప్రసాదాల 
               పంపిణి.

       ౨.   శ్రీవారి ఆలయ ప్రవేశానికి సంప్రదాయ దుస్తుల
              నియమావళి.

       ఫై రెండు నిర్ణయాలు ఆలస్యమైనా ఇప్పటికైనా తీసుకోవడం ముదావహం.  దీనిని కృత నిశ్చయంతో హర్షించి, నిబద్ధ్హతతో  అమలు పరచవలసిన బాధ్యత మన అందరి పైన ఉన్నది. 

       ప్రజామోదమైన ఈ నిర్ణయాలు తీసునున్న తితిదే పాలకమండలి, ముఖ్య నిర్వహణాధికారి గారికి మరియు ఇతరులందరికీ కృతజ్ఞతలు మరియు అభినందనలు.